Sunday, 4 December 2016

తెలుగు సామెతలు అక్షరం - ఆ

తెలుగు సామెతలు అక్షరం - ఆ

1  ఆరోగ్యమే మహాభాగ్యం
2  ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
3  ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
4  ఆకారపుష్టి నైవేద్యనష్టి
5  ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
6  ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
7  ఆకాశానికి హద్దే లేదు
8  ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు
9  ఆ తాను ముక్కే
10 ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు
11 ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
12 ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు
13 ఆస్తి మూరెడు ఆశ బారెడు
14 ఆదిలోనే హంసపాదు
15 ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
16 ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
17 ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి
18 ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
19 ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
20 ఆవు తొలిచూలు, గేదె మలిచూలు
21 ఆశకి అంతం లేదు
22 ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

No comments:

Post a Comment